ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ ఉంటాడు రాంగోపాల్ వర్మ. నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉంటాడు. తాజాగా వర్మ తెరకెక్కించిన డేంజరస్ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి యొక్క కాళ్ల వద్దను కూర్చుని వర్మ మాట్లాడిన మాటలు , చేసిన పనులు పెను వివాదానికి దారితీస్తున్నాయి. ఒక స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆడవాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు వర్మ అంటూ వర్మ పైన పలు రకాలుగా కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో ఎంతోమంది కూడా వర్మను తిట్టడం జరిగినట్లు తెలుస్తోంది .ఈ సమయంలోనే కొంతమంది వర్మకు మాత్రం మద్దతుగా నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఆషు రెడ్డి యొక్క కాలనీ ముద్దు పెట్టుకోవడానికి వర్మ గల కారణమేంటని విషయం గడిచిన రెండు రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.ఆషు రెడ్డి బొటనవేలును నోట్లో పెట్టుకొని వర్మ చేసిన పనికి అందరూ తీవ్రస్థాయిలో దుమారం రేపెలా చేస్తోంది.. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి దిగజారి పోయారు అంటూ వర్మ అని చాలా హీనంగా విమర్శిస్తున్నారు. ఆ వార్తలకు సమాధానం చెబుతూ వర్మ ఒక యూట్యూబ్ ద్వారా మరొక వీడియోని విడుదల చేయడం జరిగింది.
నన్ను అభిమానిస్తున్నాను అంటూ నన్ను ఫాలో అవుతున్నాను అంటూ నేను చేసిన పనిని తప్పుపడుతున్న వారికి ఈ వీడియో అన్నట్లుగా వర్మ విడుదల చేయడం జరిగింది. నేను ఏం చేసినా కూడా నాకు తెలుసు.. నాకు ఎవరూ ఏదో చెప్పాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ ఆడవారిని పూజించాలి ,ఆడవారిని గౌరవించాలి.. ఆడవారి యొక్క అందాన్ని ఆస్వాదించాలనేది తన యొక్క అభిప్రాయం అన్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం. అందుచేతనే ఆమె యొక్క కాలి బొటన వేలును అలా చేశాను అంతే తప్ప మరే ఉద్దేశం లేదని తెలియజేశారు.
వర్మ ఏం చేసినా కూడా చాలా డెప్త్ గా ఆలోచించిన తర్వాతే చేస్తారని తెలియజేశారు. కేవలం ఆమె మీద ప్రేమను ఆ విధంగా చూపించాల్సి వచ్చిందని కూడా తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం వర్మకు సంబంధించి వీడియోలు ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి మరి వర్మ.