చాలామంది హీరోయిన్లకు బయటనే అభిమానులు ఎక్కువగా ఉంటారు.. కానీ కొంతమందికి మాత్రం ఇండస్ట్రీలో కూడా అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే..ఇంతకు ఆ హీరోయిన్ ఎవరనుకున్నారు నిత్యామీనన్.. ఈమె తెలుగు, తమిళ ,మలయాళ భాషలలో తనకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకుంది.అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటోంది.
అయితే ఇప్పటికే నిత్యామీనన్ పెళ్లి పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.. మొన్నటికి మొన్న ఆమె పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది. మీడియా వినిపించినప్పటికీ ఆ వార్తలు ఇప్పటికి నిజం కాలేదు. అయితే తాజాగా తమిళ విమర్శకుడు బయిల్వాన్ రంగనాథన్ నిత్యామీనన్ పెళ్లిపై ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయం బయట పెట్టారు ఆయన.
ఇక ఆ విషయం ఏంటో ఆయన చెప్పిన మాటల్లో తెలుసుకుందాం. నిత్యామీనన్ పెళ్లి చేసుకోకపోవటానికి ఒక కారణం ఉంది.. అదేంటంటే ఓ మలయాళ నటి పెళ్లయ్యాక తన అత్తారింటి వాళ్లు వరకట్న విషయంలో వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది. ఆ ఆత్మహత్య చేసుకున్న ఆమెను చూశాక నిత్యామీనన్ ఒకవేళ పెళ్లి చేసుకుంటే అలాంటి పరిస్థితి తనకు వస్తుందేమో అన్న భయంతోనే పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అలాగే ఉండిపోయిందట.
అంతేకాదు నిత్యామీనన్ బరువు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కూడా పెళ్లికి దూరంగా ఉంటోంది అంటూ నిత్యామీనన్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ నటుడు విమర్శకుడైన బయిల్వాన్ రంగనాథన్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నిత్యమీనన్ పెళ్లి గురించి మరోసారి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిత్యామీనన్ చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకొని ఇప్పుడు శ్రీమతి అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కనిపించబోతోంది. ఆమె పెళ్లిపై వచ్చే వార్తలకు ఆమె స్పందించి చెప్పేస్తేనే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.