తెలుగు సినిమా ప్రేక్షకులకు అలనాటి సీనియర్ నటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో సినిమాలలో సహాయనాటిగా నటించిన మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపుగా టాలీవుడ్ లో 800 వందలకు పైగా సినిమాలలో నటించింది సుధ. ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలలో నటించిన ఈమె నేటితరం హీరోల సినిమాలలో కూడా నటించింది. అయితే గడిచిన కొంతకాలంగా సుధా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం.
ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ.. సినిమాలలో తల్లిపాత్రలు చేయడానికి ఎప్పుడూ కూడా తాను ఇబ్బంది పడలేదని ప్రతి పాత్రను కూడా చాలా ఇష్టపడే నటించానని.. అయితే తల్లి పాత్రలను నటించేటప్పుడు తన తోటి నటీనటులు సుధ నువ్వు ఎందుకు ఇలాంటి తల్లి పాత్రలు చేస్తున్నావు.. ఇలా చేస్తే రేపు మీకు కూడా ఆ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్నించారట.. నేను సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబడడానికి డైరెక్టర్ బాలచందర్ కారణమని తెలిపింది సుధ. మొదట ఆయన సినిమాతోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టానని తెలుపుతోంది.
ఇక ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 17 సినిమాలు రాఘవేందర్రావు దర్శకత్వంలో 15 సినిమాలలో నటించాను. అలా ఎంతోమంది పెద్ద చిన్న అనే తేడా లేకుండా హీరోలతో నటించానని తెలియజేస్తోంది. అప్పట్లో తల్లి పాత్రలు చాలా బాగుండేవి కానీ ఇప్పట్లో వస్తున్న తల్లి పాత్రలు పూర్తిస్థాయిలో ఉండడం లేదు సరైన డైలాగులు లేవు కేవలం స్క్రీన్ పైనే చూపిస్తున్నారు అంటు తెలియజేస్తోంది.అయితే ఒకప్పుడు తల్లిగా అద్భుతమైన పాత్రలో నటించిన సుధ ఇలా స్క్రీన్ పై కనిపించాలంటే తనకు ఆత్మ అభిమానం అంగీకరించలేదని తెలియజేస్తోంది. అందుచేతనే సినిమాలకు దూరంగా ఉంటున్నానని తెలుపుతోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.