ఆ చిన్న తప్పే నా జీవితాన్ని నాశనం చేసింది – అమీషా పటేల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో మహేష్ బాబు సరసన నాని.. ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా గదర్ 2 అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 1971 లో ఇండోనేషియా – పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అయిన విక్రమ్ భట్ తో తనకున్న రిలేషన్షిప్ గురించి గతంలో బహిరంగంగా మాట్లాడడం వల్ల తన కెరియర్ ఎలా దెబ్బతినిందో కూడా ఆమె తెలిపింది.

ఇకపోతే విక్రమ్ తో రిలేషన్షిప్ వల్ల నా కెరియర్ నాశనం అయ్యింది.. ఒక దశాబ్దానికి పైగా పురుషులకు దూరంగా ఉంటూ వస్తున్నాను అంటూ తెలిపిన ఈమె.. విక్రమ్ విడిపోవడానికి ముందు చాలా సంవత్సరాలు డేటింగ్ లో ఉన్న విషయాన్ని కూడా వెల్లడించింది. మరొకవైపు విక్రమ్ , అమీషా పటేల్ తో సంబంధం కొనసాగక ముందే బాలీవుడ్ నటి సుస్మిత సేన్ తో కూడా విక్రమ్ ప్రేమాయణం నడిపాడు. ఆమె విడిపోయిన తర్వాత అమీషా పటేల్ తో డేటింగ్ చేయడం ప్రారంభించాడు. వారిద్దరూ 2006లో డేటింగ్ ప్రారంభించి.. 2008 లో 1920 సినిమా విడుదలకు ముందే విడిపోయినట్లు వెల్లడించారు.

ఇక ఈ నేపథ్యంలోనే విక్రమ్ తో ఉన్న సంబంధం వల్ల తన జీవితంపై ఎలాంటి నెగటివ్ ప్రభావం చూపించిందో అమీషా వెల్లడిస్తూ.. ఈ పరిశ్రమలో నిజాయితీకి అసలు విలువలేదు.. నేను ఎంతో నిజాయితీగా ఉన్నాను. ఎవరినైతే నా హృదయానికి దగ్గరగా చేర్చుకున్నానో అదే నా జీవితంలో చేసిన తప్పు. ఒకరకంగా అలాంటి గుణం ఉండడం అతిపెద్ద లోపం అని కూడా భావిస్తున్నాను. పబ్లిక్ గా మరో వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండడం వల్లే నా కెరియర్ దెబ్బతిని దాదాపు 13 సంవత్సరాల పాటు అవకాశాలు లేకుండా పోయాయి. అందుకే నా జీవితంలోకి మరో వ్యక్తికి అవకాశం ఇవ్వలేదు అంటూ ఆమె తెలిపింది.

Ameesha Patel, Vikram bhutt

Share.