తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదట న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ ఆ తరువాత బుల్లితెరపై జబర్దస్త్ షో తో మరింత క్రేజీ అందుకుంది. పలు చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలో నటించిన అనసూయ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ మధ్య బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పి వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అనసూయ హీరోయిన్గా ఎందుకు కాలేకపోయానని విషయాన్ని తెలియజేయడం జరిగింది.
అనసూయ మాట్లాడుతూ అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలు అవకాశం వచ్చింది అందులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారని నేను చేయనని చెప్పానని తెలిపింది.. గుంపులో ఒకరిగా నటించడం తనకు నచ్చదని తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని తెలియజేసింది అనసూయ.. అయితే అందులో నటించడానికి నిరాకరించడంతో చాలామంది తనను విమర్శించారని.. ఈ విషయంలో తను నో చెప్పడం తప్పు కాదు కానీ నో చెప్పే విధానం తప్పేమో అని తెలియజేసింది అనసూయ. అయినా కూడా చివరికి త్రివిక్రమ్ గారికి సారీ చెప్పానని తెలిపింది.
షూటింగ్లో నా పని నేను చేసుకుంటూ వెళ్తాను సినిమా అయ్యాక జరిగే పార్టీలకు కూడా దూరంగానే ఉంటానని ఆ కారణంగానే హీరోయిన్ అవకాశాలు కూడా కోల్పోయానని అలా పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయి అంటే వాటిని అసలు నేను ప్రోత్సహించను.. ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే అందులో తనకే ప్రాధాన్యత ఉండాలనుకునే దాన్ని కానీ తనలో మార్పు రావడం జరిగిందని తెలిపింది అనసూయ.
సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ప్రతి మహిళ స్వేచ్ఛ కోరుకుంటుంది.. నా భర్త నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ ఇళ్లల్లో మహిళలను తలుచుకుంటే నాకు జాలి వేస్తుంది అని విమర్శించేవాళ్లు ఎన్ని అంటున్న కూడా తన పోస్టులు చూసి స్ఫూర్తి పొందే వాళ్లే చాలామంది ఉంటారని తెలిపింది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి