టాలీవుడ్ ఇండస్ట్రీలో ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాప్సి. ఆ చిత్రం ఏదో అలా ఆడింది కానీ ఆ తరువాత అవకాశాలను బాగానే దక్కించుకుంది. దరువు, మిస్టర్ పర్ఫెక్ట్, ఇలా పలు అగ్ర హీరోలతో నటించినప్పటికీ టాలీవుడ్ లో మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.అందుకనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. తాజాగా తాప్సి ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం జరిగింది.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అలాగే నెపోటిజం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సి పాల్గొన్నప్పుడు అక్కడ ఈమెకు క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు స్పందిస్తూ తాప్సి దక్షిణాది ఇండస్ట్రీ కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయని ధైర్యంగా చెప్పింది. అంతేకాకుండా ఇలాంటి ఇబ్బందులు నాకు చాలానే ఎదురయ్యాయని ఆమె తెలిపింది.
నేను బాలీవుడ్లోకి వచ్చిన మొదట్లో ఇలాంటివి తనకు చాలా ఎదురయ్యాయని..కానీ వారికి గట్టి సమాధానం ఇచ్చానని కూడా తెలియజేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్లిన మొదట్లో డైరెక్టర్లు హీరోలు అర్ధరాత్రి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ వస్తావా అని పిలిచేవారట.నేను అలాంటి దాన్ని కాదు.. నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని వారికి సమాధానం చెప్పేదట. అయినా కానీ వారు ఆ మాటలను పట్టించుకోకుండా నువ్వు ఇప్పుడు వస్తే బాగుంటుంది లేకుంటే ఇండస్ట్రీలో నిన్ను ఎదగనివ్వకుండా చేస్తాము అని బెదిరించేవారట..తాప్సి ఈ సందర్భంలో చేసిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
హీరోలు మాత్రమే కాకుండా డైరెక్టర్లు కూడా తనని చాలా ఇబ్బంది పెట్టారని మనం కాస్త వారికి భయపడితే ఇంకా భయపెడతారని అందుకోసమే నేను భయపడకుండా వారిని ఎదిరించి ఇండస్ట్రీలో ఇంత ఎత్తుకు ఎదగానని ఆమె తెలియజేసింది తాప్సి.. గతంలో కూడా తాప్సి కొంతమంది హీరోలు తనని డేటింగ్ చేయమన్నారని వార్తలు కూడా తెలియజేసింది.