జూనియర్ ఎన్టీఆర్ కు చిన్నప్పటి నుంచి ఖరీదైన కార్లు అన్నా, వాచ్ అన్న చాలా ఇష్టమట. అందుకే ఏదైనా నచ్చితే ఎంత ఖరీదైనా సరే తప్పకుండా కొనుగోలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు ఒక వాచ్ బాగా నచ్చడంతో దానిని ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. రిచర్డ్ మిల్లే RM కు చెందినటువంటి 001 కార్బన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ వాచ్ ఎంత ఖరీదైన వాచ్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక ప్రస్తుతం రోజ్ గోల్డ్ లోటస్ ఎఫ్ వన్ టీం లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన ఎడిషన్ కూడా ఎంతో కాస్ట్లీ గా ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ వాచ్ ధర తెలిస్తే మాత్రం ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఈయన చేతికున్న ఈ గడియారం విలువ అక్షరాల రూ.39,932,395 . అంటే సుమారుగా 4 కోట్ల రూపాయలు అని చెప్పవచ్చు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఇలాంటి వాచ్లు మరో రెండు ఉన్నాయట.