తన వివాహంపై..షాకింగ్ వ్యాఖ్యలు చేసిన రకుల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కెరటం సినిమాతో టాలవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఊహించని స్థానంలో పాపులారిటీ సంపాదించుకుంది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే రకుల్ బర్త్ డే సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. బాలీవుడ్ నటుడు ప్రొడ్యూసర్ జాకీ భగ్నం నీతో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది.

ఈ విషయం బయటకు రావడంతో ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ..నచ్చిన విషయాలను వినడానికి మాత్రమే తాను ఇష్టపడతానని తెలిపింది. తాను ప్రేమలో ఉన్నానని విషయం అందమైన విషయం అని అందుకే ఈ విషయాన్ని బయట పెట్టాను అని తెలియజేసింది. ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలనిపించింది అందుకే ఈ విషయాన్ని తెలియజేశానని చెప్పింది రకుల్.

ప్రస్తుతం తన కెరీర్ కేవలం సినిమాల మీద ఉంది. పెళ్లి మీద లేదని తెలియజేస్తోంది రకుల్. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని అందరికీ చెబుతాను అంటూ కామెంట్ చేసింది రకుల్.

Share.