దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఆయన స్థాయి మరింత ఎత్తుకు ఎదిగిపోయింది అనే చెప్పాలి. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి 2022 జనవరి లోసంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ సినిమా నుంచి సోలో సాంగ్ జననీ అనే పాట విడుదలై ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తెలిసిందే. ఈ పాట చూసినవాళ్లంతా కన్నీటిని పెట్టుకోవడం గమనార్హం. అంత అద్భుతంగా ఈ పాటను తెరకెక్కించారు. ఈ అద్భుతమైన పాటకు కీరవాణి లిరిక్స్ అందించారు.
రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య, ఈ సాంగ్ తమిళ వెర్షన్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ అధికారులు చెన్నైలో నిర్వహించిన ‘జనని’ తమిళ వెర్షన్ ‘ఉయిరే’ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. గత 3 సంవత్సరాలుగా తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు అంటూ రాజమౌళి తెలిపారు.జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో తప్పకుండా వారితో సంభాషిస్తానని రాజమౌళి వారికి హామీ ఇచ్చారు. భారతీయ అన్ని ప్రాంతీయ భాషలలో ఈ సినిమాను విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించాడు.