Thamannah..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా (Thamannah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోయిన్గా దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా తన కెరీర్‌ను కొనసాగించిందని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ సైతం ఎక్కువగా ప్రేమలో పడడం డేటింగ్ చేయడం లాంటివి చాలా కామన్ గా జరుగుతూనే ఉంటాయి.. తమన్నా కూడా గతంలో ఎంతో మంది అబ్బాయిలను ప్రేమించి మోసపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
తమన్నా మొదటిసారి హ్యాపీడేస్ సినిమా ద్వారా బాగా గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాతో చాలామంది హీరోలు ఆమెకు అట్రాక్ట్ అయిపోయారు.దీంతో చాలామంది బడా హీరోల సరసన నటించే అవకాశాలు లభించాయి. తమన్నా చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిని సిన్సియర్‌గా లవ్ చేసిందట. కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా రోజులు ఆమెతో క్లోజ్ గా ఉండి ఆ తర్వాత సిస్టర్ అని పిలిచారట. దాంతో ఆ అబ్బాయి తన పైన వేరే ఒపీనియన్ పెట్టుకున్నారని ఆ లవ్ నీ మర్చిపోయిందట.
అలాగే ఇండస్ట్రీకి వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ తో కూడా చాలా రోజులు తమన్నా ప్రేమాయణం కొనసాగించిందని వార్తలు వినిపించాయి. ఒకానొక దశలో వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు వినిపించాయి. కానీ కార్తీ తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోలేదని అందుచేతనే వేరే అమ్మాయిని కార్తీక్ వివాహం చేసుకున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
ఇక డిప్రెషన్ నుంచి బయటికి వచ్చిన తమన్నా ఆ తర్వాత స్టార్ క్రికెటర్ కోహ్లీ తో కూడా తమన్నా కొద్దిరోజులు డేటింగ్ లో ఉందని వార్తలు వినిపించాయి అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. కానీ కోహ్లీ మాత్రం హీరోయిన్ అనుష్క శర్మల వివాహం చేసుకున్నారు. దీంతో తమన్నాకు లవ్ కలిసి రాలేదని వార్తలు వినిపించాయి తాజాగా బాలీవుడ్ నటుడుతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం.