పాయల్ రాజ్ పుత్.. ఇండస్ట్రీలో అందాల ఆరబోతకు పెట్టిందిపేరు ఈ ముద్దుగుమ్మ.. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసిన రొమాన్స్ గురించి ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు అనే చెప్పాలి. ఆ సన్నివేశాలను ఇంకా మర్చిపోకముందే తాజాగా లో దుస్తులు లేకుండా కేవలం పసుపు కలర్ కోటు వేసుకొని , బటన్స్ విప్పి మరీ తన అందాలను చూపించింది. ఇక ఈ వీడియో చూసిన కుర్రకారుకు నిద్రలేకుండా పోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంపై పాయల్ రాజ్ పుత్ తల్లి బాగా చీవాట్లు పెట్టినట్లు.. అంతేకాదు సినీ ఇండస్ట్రీ నుంచి వెంటనే రమ్మని, తన వృత్తిని మానుకోమని కూడా వార్నింగ్ ఇచ్చిందట.
అయితే ఈ విషయంపై పాయల్ తన తల్లికి సర్దిచెప్పి.. తనతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పి వచ్చాను అని తెలియజేసింది పాయల్ రాజ్ పుత్. దీంతో ఆమె తల్లి కూడా కాస్త కూల్ అయినట్లుగా తెలిపింది. ఇలాంటి విషయాలన్నీ తన కెరీర్ ని డ్యామేజ్ చేయలేవని చెప్పుకొస్తోంది. నేనేమీ కావాలని అలా చేయలేదని చెప్పుకొస్తోంది ఆమె. అయితే నెటిజన్ల పై కూడా కాస్త ఘాటుగానే కామెంట్లకు రిప్లై ఇచ్చింది. వృత్తిపరంగా చేస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేసింది.