ఆ స్టార్ హీరో సినిమాలు మేం కొన‌లేం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం తెలుగులో గజినీ, ఆరు ఇలా వరుస హిట్లతో సూపర్ స్టార్ హీరోల రేంజ్‌కు వెళ్లిపోయాడు కోలీవుడ్ టాప్ హీరో సూర్య. తెలుగులో 2005 – 2010 మధ్యలో స్టార్ హీరోలకు సమానంగా సూర్య సినిమాలకు వసూళ్లు వచ్చేవి. ఇక్కడ సూర్యకు విపరీతంగా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఇక సింగం సినిమాలతో సూర్య తెలుగులో ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ టైంలో సూర్య సింగం సీరిస్ సినిమాలు వస్తున్నాయంటే తమిళనాడును మంచిని క్రేజ్‌ తెలుగులో ఉండేది.

సింగం సీరిస్ సినిమాలతో సూర్య మార్కెట్ తెలుగులో ఏకంగా 30 కోట్ల వరకు వెళ్ళిపోయింది. సూర్య ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ ప్రమోషన్ల‌కు చాలా టైం కేటాయించేవారు. అలాంటి సూర్య మార్కెట్ క్రమ క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు సూర్య‌కు హిట్ వచ్చి చాలా రోజులు అయింది. చివరకు సూర్య‌ సినిమాల పరిస్థితి మ‌రింతగా దిగజారి పోయింది. మొదటి రోజు ఫస్ట్ షో కూడా ఫుల్‌ కాని పరిస్థితి వచ్చేసింది. ఇక సూర్య తాజా చిత్రం ఎన్జీకే రిజల్ట్ తో సూర్య మార్కెట్ మరింత దిగజారి పోయింది.

మేథావి డైరెక్ట‌ర్‌గా పేరున్న శ్రీరాఘ‌వ ఎన్జీకేను పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించ‌డంతో ఎన్జీకే ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. తొలి రోజు తొలి ఆట‌కే ఈ సినిమాకు జ‌నాలు లేకుండా పోయారు. ఇక ఈ సినిమా నిర్మాణంలో సూర్య‌కు కూడా వాటా ఉంది. రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా లాభాల్లో వాటా అనుకున్నాడ‌ట‌. ఇప్పుడు ఫైన‌ల్ ర‌న్ చూస్తే మొత్తం అన్ని భాష‌లు క‌లిపి రూ.26 కోట్లు రాబ‌ట్టింద‌ట‌.

తెలుగు వెర్షన్ ని 9 కోట్లకు రాధామోహన్ కొంటె అందులో సగం రాని ప‌రిస్థితి. సూర్య రెమ్యున‌రేష‌నే రూ.25 కోట్లు అంట‌. అంటే సూర్య‌కు ఇచ్చే రేటు కూడా అన్ని భాష‌ల్లో రాలేదు. ఈ ప్ర‌భావం ఆగ‌స్టులో వ‌స్తోన్న కాప్పన్ మీద పడుతోంది. ఆ సినిమాను త‌మిళ్‌లో మిన‌హా మిగిలిన భాష‌ల్లో కొనేందుకు ఏ బ‌య్య‌ర్ కూడా ముందుకు రాని ప‌రిస్థితి.

Share.