ప్రముఖ సీరియల్ నటి లహరి బుల్లితెరపై ఎంతో మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా పోలీసులు అరెస్టు చేయడంతో ఆమె అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే.. లహరి మద్యం సేవించి కారు డ్రైవ్ చేయడంతోపాటు రోడ్డు యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి తన విధులు ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా లహరి కారు అతన్ని ఢీ కొంది.
ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగినా లహరి కారులోంచి బయటకు దిగలేదు. దీంతో వాహనదారులు ఆమెపై మండిపడుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు నటి లహరిని పోలీస్టేషన్‌కు తరలించారు. ఇక ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. లహరి చాలా సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్‌లో నటిస్తోంది.