ఈ మధ్య ఎక్కడ చూసినా కరొనా బారిన పడ్డవారు ఎక్కువగా పెరిగారు. తాజాగా తెలంగాణ స్టేట్ లో సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించినది. 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ గా తేలింది.మొత్తం మీద ఆ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఆదివారం 261 మంది విద్యార్థులకు, 27 మంది సిబ్బందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేపట్టారు.
అందులో 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలుకు ఈ వైరస్ సోకి నట్లుగా తెలుస్తోంది. అయితే పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను సేకరించి టెస్టింగ్ ల్యాబ్ కి పంపించారు. మిగతా విద్యార్థులకు ఇవాళ కరోనా పరీక్షలు చేస్తున్నారు. వైరస్ సోకిన వారిని అక్కడే ఒక సపరేట్ రూమ్ లో ఉంచి వారికి వైద్యం అందిస్తున్నారు . అయితే విద్యార్థుల ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉన్నదని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో దాదాపు 27 మంది విద్యార్థులకు కరోనా సోకినది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి గురుకుల ప్రిన్సిపల్ మిగతా విద్యార్థులను కొద్ది రోజుల పాటు విద్యార్థులను ఇంటికి పంపించారు. అయితే సంగారెడ్డిలో ఉన్న ఈ పాఠశాలలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.