తెలుగు బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయమయ్యారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో టీవీ యాంకర్ గా పేరుపొందిన జోర్దార్ సుజాత తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈమెతో కలిసి జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ ఉన్నారు రాకింగ్ రాజేష్. ఇక వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయాన్ని తమ పెద్దలకు చెప్పి పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు సంబంధించి సుజాత ఒక వీడియోను కూడా తెలియజేసినట్లు సమాచారం.వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ముఖ్యంగా రాకింగ్ రాకేస్ తో తనకు పరిచయం ఎలా ఏర్పడింది ఆ తర్వాత స్నేహం ఆ స్నేహం కాస్త ప్రేమగా ఎలా మారింది అనే విషయాన్ని ఒక వీడియో ద్వారా షేర్ చేసింది. ఎంతో మధురమైన జ్ఞాపకాలను ఈ వీడియోలో పంచుకుంది సుజాత. ఈ నెల చివరిలో తమ ఎంగేజ్మెంట్ ఉండబోతుందని అదే రోజున లగ్నపత్రిక రాసుకొని వివాహ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నామని తెలిపింది. ఎట్టకేలకు పెద్దలు అందరితో కలిసి తమ పెళ్ళికి ఒప్పించామని తెలిపింది. ఇక తామకు సంబంధించిన ఎంగేజ్మెంట్ వీడియోను కూడా పంపిస్తామని తెలిపింది.
ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .దీంతో పలువురు బుల్లితెర సెలబ్రెటీలు, నేటిజెన్లు సైతం తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. టీవీ యాంకర్ గా పరిచయమైన సుజాత బిగ్ బాస్ షో తో మరింత పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ తో కలిసి జబర్దస్త్ షోలో సందడి చేస్తోంది.