పోచమ్మకు బోనం సమర్పించిన అనుష్పాల?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా కోడలు ఉపాసన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఉపాసన చెల్లెలు అనుష్పాల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యి మరదలి పెళ్లి బాధ్యతలను కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వేడుకలకు సంగీత్ ఫంక్షన్ లను భారీగా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లా దోమకొండగడి కోట వారసులైన కామినేని అనిల్ కుమార్, శోభనల కుమార్తె అనుష్పాల తాజాగా పోచమ్మ పండుగ నిర్వహించారు.

పెళ్లి కూతురు అనుష్పాల పోచమ్మకు బోనం సమర్పించారు. ఇక ఈ సెలబ్రేషన్స్ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, దివంగత కామినేని ఉమాపతి రావు భార్య పార్వతమ్మ హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి వచ్చారు.అలాగే ఈ వేడుకలకు రామ్ చరణ్,సతీమణి ఉపాసన అలాగే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.అలాగే అపోలో హాస్పిటల్ కు చెందిన వందలాది మంది ఉద్యోగులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Share.