Tejaswi..తెలుగు ఇండస్ట్రీలో మొదట సైడ్ క్యారెక్టర్లలో నటిస్తు హీరోయిన్గా పలు చిత్రాలలో నటించింది తేజస్వి(Tejaswi) మదివాడ. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది తేజస్వి మదివాడ.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావాలి అంటే కచ్చితంగా టాలెంట్ ఉంటే సరిపోతుంది. ఇదంతా గతంలో కానీ ఇప్పుడు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చు కు ఒప్పుకునే వారికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ మీద ఇప్పటికీ ఎంతోమంది నటీమణులు స్పందించడం జరిగింది. ముఖ్యంగా మీటు ఉద్యమం జరిగిన తర్వాత ఈ విషయంపై మరింతమంది స్పందిస్తూ ఉన్నారు. తాజాగా తేజస్వి కూడా ఈ విషయం పైన స్పందించడం జరిగింది.
ఐస్ క్రీమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమెను అందరూ ఐస్ క్రీమ్ పిల్ల అనుకుంటూ పిలవడం మొదలుపెట్టారు..ఇక రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న తేజెస్వి టాలీవుడ్ లో తెలుగు వారికి అవకాశాలు పెద్దగా రావు.. అమ్మాయిలు అయితే కచ్చితంగా కమిట్మెంట్కు ఒప్పుకుంటేనే అవకాశాలు వస్తాయని.. అలాంటి వాటికి మనవారు రెడీగా ఉండరు.. ఇక ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు అయితే అన్నిటికి సిద్ధంగానే ఉంటారంటూ తెలియజేసింది.
వారికీ కమిట్మెంట్ కూడా ఓకే అని అందుకే వారికి అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన తెలుగు అమ్మాయిలకు మాత్రం ఇలాంటి వాటిని పెద్దగా ఎంకరేజ్ చేయరు. నన్ను కూడా చాలామంది కమిట్మెంట్ అడిగారు కానీ నేను వాటికి అసలు ఒప్పుకోలేదు.. అందుకే స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయానని తెలియజేస్తోంది. తేజేస్వి.. ప్రస్తుతం తేజస్వి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.