హీరోయిన్ ను టార్చర్ పెట్టడం నా అలవాటు: తేజ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆర్జివి కాంపౌండ్ నుండి వచ్చిన ఏ డైరక్టర్ అయినా ఒకే తరహాలో ఆలోచిస్తుంటాడు. ఆర్జివి శిష్యులే అలా ఉంటే ఆర్జివి డిపార్ట్ మెంట్ లో అంటే ఆర్జివి డైరక్టర్ గా ఉన్నప్పుడు కెమెరా మెన్ గా చేసిన తేజ ఎలా ఉంటాడు. ఎంతమందికి తెలుసో కాని ఆర్జివి డైరక్టర్ గా ఉన్నప్పుడు తేజ అతని సినిమాలకు కెమెరా వర్క్ చేశాడు. దాదాపుగా తేజ కూడా కొన్ని సమయాల్లో ఆర్జివి లానే ఆలోచిస్తాడు.

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన తేజ ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో సీత సినిమా చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కిశోర్, అనీల్ సుంకర నిర్మించారు. మన్నారా చోప్రా కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం జరిగింది. సినిమా గురించి చెబుతూ శ్రీనివాస్, తేజ వారి కెరియర్ లో చేయని కొత్త పాత్రలు చేశారని తేజ అన్నారు.

తన సినిమా సూపర్ డూపర్ కొత్తగా ఉందని తాను అందరిలా చెప్పనని.. సినిమా బాగుంటే బాగుందని చెప్పండి.. లేదంటే తనని తిట్టండి అలా చేస్తే తర్వాత సినిమా మంచిగా చేస్తానని అన్నాడు తేజ. ఇక సినిమాలో మన్నారా చోప్రాని టార్చర్ పెట్టానని.. రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడం తనకు రాదని అందుకే వెరైటీగా చేస్తానని చెప్పుకొచ్చారు. మరి తేజ సీత సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరో 3 రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share.