తేజ్ ఐ లవ్ యు వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్ యు’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తేజు కెరీర్‌లో ఈ సినిమా డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్‌గా మారి తేజుకి చుక్కలు చూపించింది. రొమాంటిక్ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ డైరెక్షన్‌లో ఈ సినిమా రావడంతో తొలుత ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ సినిమా కూడా రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. కరుణాకరన్ మార్క్ ఎక్కడా కూడా కనిపించకపోవడమే కాకుండా డబ్బా సినిమాలకు పోటీగా ఈ సినిమా చూస్తున్నంతసేపు చిరాకు రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు అదే ఫ్లాప్ ముద్రను గుద్దారు. దీంతో తేజు కెరీర్‌లో డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు నమోదు అయ్యాయి. మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించినా కూడా అది చిత్ర విజయానికి ఏమాత్రం హెల్ప్ కాలేదు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ రన్‌లో కేవలం రూ. 4.22 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏరియా వారీగా ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 0.85
సీడెడ్ – 0.66
వైజాగ్ – 0.60
నెల్లూరు – 0.17
కృష్ణా – 0.38
గుంటూరు – 0.43
ఈస్ట్ – 0.35
వెస్ట్ – 0.33
టోటల్ ఏపీ+తెలంగాణ – 3.77
కర్ణాటక & రెస్టాఫ్ ఇండియా – 0.30
యూఎస్ – 0.15
టోటల్ వరల్డ్‌వైడ్ – 4.22 కోట్లు

Share.