Tarun.. తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు పొందిన తరుణ్ (Tarun )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరోగా ఉన్నప్పుడు పలు చిత్రాలలో నటించి వరుస విజయాలను అందుకున్నారు. అయితే గతంలో హీరో తరుణ్ పైన కూడా పలు రూమార్సు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్, తరుణ్ మధ్య ఏదో ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత.. మరొక హీరోయిన్ ప్రియమణితో కూడా లవ్ లో ఉన్నారని రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
లవర్ బాయ్‌గా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న తరుణ్ కి ఆర్తి అగర్వాల్ తో కూడా ఎఫైర్ ఉందని వార్తలు వినిపించాయి.. దీంతో వీరి పేర్లు బాగా పాపులర్ అవడం జరిగింది. వాస్తవానికి ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి కారణం కూడా తరుణ్ అని ఆమె చనిపోయే సమయంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి. తరుణ్ తల్లి వీరి పెళ్ళి నిరాకరించడంతోని ఆర్తి అగర్వాల్ మరణించిందని వార్తలు ఇప్పటికి వినిపిస్తూ ఉంటాయి.
ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరు కూడా నోరు విప్పలేదు.ఆ తర్వాత హీరోయిన్ ప్రియమణితో ఒకటి రెండు సినిమాలలో కలిసి నటించిన తరుణ్ ఆమెతో నటించడంతో వీరిద్దరు పైన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే ఆ తర్వాత ఇద్దరు కూడా కొంతకాలం ఫెడవుట్ అయిపోయారు కానీ కొంతకాలం తర్వాత ప్రియమణి మాత్రం బాగానే సక్సెస్ అయ్యింది. తరుణ్ మాత్రం పలు బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ ఉన్నారు. కానీ వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలలో వీరిద్దరి మధ్య సన్నిహిత్యం చూసి పలు రూమర్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి కానీ ఈ విషయం మీద కూడా ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట.