హీరోయిన్ల అందంతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో కూడా ఎన్నో వర్కౌట్ చేస్తూనే ఉంటారు.ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు కఠినమైన యోగాలు వేస్తూ తమ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటివారికి సినీ ఇండస్ట్రీ లో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే చాలామంది హీరోయిన్స్ జీరో సైజుని మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ హీరోయిన్ తాప్సీ మాత్రం అందరికంటే రెండు అడుగులు ముందుకేసి ఏకంగా సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకుంటోంది.
అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ కొంతకాలంగా జిమ్ములో పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది అంటూ కామెంట్లు చేయడం జరిగింది.. తన జిమ్ ట్రైనర్ తో కలిసి కండలు తిరిగిన దేహంతో భాడిని ఎక్స్పోజింగ్ చేస్తూ చూపిస్తోంది.. ఇమే ఇలా చూడడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు..నువ్వు ఇప్పటికి లేడీ టైగర్ ష్రాఫ్ లా ఎందుకు మారిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటిసారి డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఆ తరువాత వస్తాడు నా రాజు, వీర ,మిస్టర్ పర్ఫెక్ట్, దరువు ,మిషన్ ఇంపాజిబుల్ వంటి చిత్రాలలో నటించింది. కానీ ఇవి తెలుగులో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపు తన అడుగులు వేసింది.. అక్కడి హీరోయిన్ గా సెటిల్ అయ్యి పలు సినిమాలలో చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలలో నటిస్తోంది కాబట్టి ఇలా జిమ్ములో కష్టపడి కండలు పెంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తాప్సి అందానికి సిక్స్ ప్యాక్ బాడీకి మరింత హైలెట్ గా కనిపిస్తోందని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.
View this post on Instagram