తాప్సి బాడీ పార్ట్స్ అంటే అతడికి చాలా ఇష్టమట !

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినా… గ్లామర్ పాత్రలతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది తాప్సి . కానీ ఆమెకు ప్రస్తుతం తెలుగు చిత్ర సీమ లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఆమెకు హిందీ లో మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. గ్లామర్ పాత్రలతో పాటు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా నటిస్తుంది తాప్సి. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్ లో.

తాజాగా… ట్విట్టర్ లో ఒక వ్యక్తి తాప్సి ని ట్యాగ్ చేసి మీ బాడీ పార్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ట్వీట్ చేసాడు. అయితే నాకు కూడా నా బాడీ పార్ట్స్ అంటే చాలా ఇష్టం అని తాప్సి అతగాడి ట్వీట్ కి రిప్లై ఇచ్చింది, నా బాడీ పార్ట్స్ లో నాకు ఇష్టమైన పార్ట్ మస్తిష్కపు ( సెరిబ్రమ్ ) అని తాప్సి ట్వీట్ చేసింది, తాప్సి చేసిన ట్వీట్ కు నెటిజన్స్ అంత ఆమెను మెచ్చుకుంటున్నారు, సరైన ట్వీట్ వేశావు అని ఆమెను మెచ్చుకుంటున్నారు.

తాప్సి వేసిన ట్వీట్ తరువాత గూగుల్ లో చాలా మంది మస్తిష్కపు ( సెరిబ్రమ్ ) ని సెర్చ్ చేసారు అని గూగుల్ ట్రెండ్స్ లో నిరూపితమైనది, చిన్నప్పుడు మనం మన మెదడు లోని పార్ట్స్ గురుంచి చదువుకున్నాం. కానీ అవన్నీ గుర్తు ఉంటే అలాంటి ట్వీట్ ఎందుకు వేస్తాడు తను అని తాప్సి ని ట్రోల్ చేసిన వ్యక్తిని ఆడుకుంటున్నారు సోషల్ మీడియా లో.

Share.