టాలీవుడ్లో అసలే హీరోయిన్ల పోటీతో ఎప్పుడు ఎవ్వరికి అవకాశాలు వస్తాయో… ఎవరి అవకాశాలు ఎవ్వరు తన్నుకుపోతారో తెలియని పరిస్థితిలో ఇప్పుడు తమన్నా అవకాశాన్ని మరో బ్యూటీ తన్నుకుపోవడం చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. పూజా కార్యక్రమాలతో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది తమన్నా… మిల్కీ బ్యూటీ ఖాతాలో మరో సినిమా చేరిందనుకుంటున్న తరుణంలో మరో బ్యూటీ వచ్చి తమన్నా అవకాశాన్ని గద్దలా తన్నుకు పోయిందట.
ఇంతకు తమన్నా ను ఔట్ చేసి ఇన్ అయిన సుందరి ఎవరు అనేదేగా… మిల్కిబ్యూటి తమన్నా ఒప్పుకున్న సినిమాకు మరో కొత్త హీరోయిన్ను ఎన్నుకున్నాడట దర్శకుడు ఓంకార్. రాజుగారి గది3 సినిమాను తమన్నాతో చేయాలని దర్శకుడు ఓంకార్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాడు. తమన్నాతో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. కానీ ఏమి జరిగిందో ఏమో కాని తమన్నాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారట. తమన్నా కు బదులుగా అందాల సుందరి తాప్సీని ఎంపిక చేశారట.
మిల్కీ బ్యూటీ ఈ ప్రాజెక్టు నుంచి సడన్గా ఎందుకు తప్పుకుందనే ప్రశ్న వినిపిస్తుంది. తమన్నాకు సినిమా ప్రారంభంకు ముందు ఒక స్క్రిప్ట్ చూపి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేశాడట. అవి తమన్నాకు తెలియకుండా జరిగిందట. దీంతో తమన్నా దర్శకుడ ఓంకార్ తీరు నచ్చకపోవడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. తమన్నా తప్పుకోవడంతో తాప్సీని వెంటనే సంప్రదించడంతో ఆమే వెంటనే ఒప్పుకుందట. తమన్నా కన్నా తక్కువ రేటుకే తాప్సీ ఒప్పుకోవడంతో దర్శకుడు ఓంకార్ కూడా లోలోన సంబుర పడుతున్నాడట.