టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పనవసరమే లేదు. ఒకవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ముందుకు దూసుకుపోతున్నారు . పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రస్తుతం చిత్రమ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరహర వీరమల్లు సినిమా. ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పవన్ కళ్యాణ్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మార్కెట్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ రూ .50 నుంచి రూ .80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. అంత రెమ్యూనరేషన్ తీసుకుంటూ కూడా పిల్లలు ఫీజులు కట్టలేరా పిల్లలు కోసం దాచుకున్న డబ్బుతో పార్టీ ఆఫీస్ నిర్మించారా అని కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేయరు కనీసం జైలుకు కూడా వెళ్లలేదు.. అంతమంది బౌన్సర్లు తో బిల్డప్ ఎందుకు? నువ్వు సామాన్యు మనిషివే అంటారు కదా అలాంటప్పుడు ఏ సెక్యూరిటీ లేకుండా ప్రజల వద్దకు వెళ్ళు అంటూ ప్రశ్నించారు తమ్మారెడ్డి భరద్వాజ్.
పవన్ ఎప్పుడో ఒకసారి రావటం మీటింగ్ పెట్టి అందరిని తిట్టటం ఎందుకు ఇవన్నీ అవసరమా..ఇప్పటికే మీ సినిమాలు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ పూర్తి చేయవలసి ఉంది అంటూ తెలియజేశారు. మీరు పార్టీ పెట్టినప్పుడు మంచి యువకుడు వస్తున్నాడని మేము చాలా సంతోష పడ్డాం కానీ మీరు ఇప్పుడు గాడి తప్పుతున్నారెమో అంటూ తెలియజేశారు.. ఇప్పుడు మీ వైఖరితో మేము విసిగిపోతున్నాం అంటూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.. అయితే పవన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.