గతంలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన తమ్మారెడ్డి భరద్వాజ్ RRR సినిమా గురించి మాట్లాడుతూ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డు రావడం కోసం కేవలం ఫ్లైట్ లో టికెట్లకె రూ.80 కోట్లు ఖర్చు చేశారు అదే డబ్బు తనకి ఇస్తే 8 సినిమాలు తీస్తానని తెలియజేశారు. తమ్మ రెడ్డి భరద్వాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది.. నీ** మొగుడు ఖర్చు పెట్టారా రూ.80 కోట్లు RRR ఆస్కార్ కోసం అంటూ వైసీపీ వారి భాషలు సమాధానమని కామెంట్లు చేశారు.
తనపై చేసిన ఈ కామెంట్లకు తమ్మారెడ్డి స్పందిస్తూ.. నేను ఆ స్థాయిలో మాట్లాడగలను కానీ నా తల్లితండ్రులు సంస్కారంతో పెంచారు. ఆస్కార్ కోసం ఖర్చు పెట్టే డబ్బుతో ఎక్కువ సినిమాలు తీయచ్చని మాత్రమే అన్నానని.. దీన్ని తప్పుగా చెబుతూ నీచంగా మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి ప్రతిస్పందించారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం RRR గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ రాజమౌళిని పొగుడుతూ ఒక వీడియోను కూడా చేశాను దాని గురించి మాట్లాడకుండా మూడు గంటల వీడియోలు కేవలం ఆ రెండు నిమిషాలు కామెంట్లు పరిధిలోకి తీసుకొని తన పైన ఈ రీతిలో కామెర్లు చేయడం మానసిక చాలా బాధ కలిగిందని తనను తిట్టిన వారికి సిగ్గుండాలి అని ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి ముఖం మీద పడుతుందని నాగబాబు వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ వేశారు తమ్మారెడ్డి.
ఇక గతంలో నువ్వు ఎవరెవరు కాళ్లు పట్టుకున్నావో బయట పెట్టమంటావా అంటూ నాగబాబుకు గట్టి కౌంటర్ వేశారు తమ్మారెడ్డి. దీంతో మరి రాబోయే రోజుల్లో ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.