మహేష్ ను అవమానపరచిన తమిళ కమెడియన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +
సూపర్ స్టార్ మహేష్ ను అవమానపరుస్తూ అతని ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మీద తమిళ స్టాండ్ అప్ కమెడియన్ మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తమిళ కామెడీ షోలో భాగంగా కామెడీ చేస్తూ మహేష్ ఎక్స్ ప్రెషన్స్ మీద కామెడీ చేశాడు మనోజ్. మహేష్ ముఖం బండరాయని.. అతనికి ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ ఉండవని అన్నాడు.
అంతేకాదు మహేష్ మేల్ వర్షన్ లో ఉన్న కత్రినా అంటూ అవమానపరచాడు. స్పైడర్ సినిమాలో మురుగదాస్ ఎంత చెప్పినా ఎక్స్ ప్రెషన్ కుడు (ఇవ్వు) అంటున్నా మహేష్ మాత్రం బండమొహంతో నిలుచున్నాడని మనోజ్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ పై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ ఫ్యాన్స్ మనోజ్ ను ట్రోల్ చేస్తూ బండబూతులు తిడుతున్నారు. డీసెంట్ గా ఉండే మహేష్ ఫ్యాన్స్ ను కెలికిన మనోజ్ కు మహేష్ ఫ్యాన్స్ ఏరకంగా బుద్ధి చెబుతారో చూడాలి. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారగా దీనిపై తమిళ సిని పరిశ్రమ నుండి ఏ హీరో అయినా మాట్లాడతాడేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తమిళ హీరోలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటే తమ హీరోని ఇంతగా అవమానిస్తారా అంటూ మహేష్ ఫ్యాన ఫైర్ అవుతున్నారు.

Share.