తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం, డాన్స్ నటనతో ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమెతో పాటు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ సైతం వివాహం చేసుకొని ఉంటే తమన్నా ఇంకా వివాహ ఊసే ఎత్తలేదు. అయితే గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి తమన్నా ఒక నటుడుతో లవ్ లో ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ నటుడు గురించి తెలుసుకోవడంతో పాటు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసుకుందాం.
మొదట హ్యాపీ డే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా.. తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. దీని తర్వాత ఈమెకు పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ సమయంలోనే ఈమెకు తమిళంలో కూడా అవకాశాలు రావడంతో అక్కడ కూడా బాగానే రాణించింది. దీంతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని చెన్నైలో ఉన్నది అక్కడ కూడా బాగా సినిమాలలో చేసి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అలా తన ప్రయాణాన్ని ఇంకా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.
ఇక ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పలు రూమర్స్ వినిపించాయి. గడచిన కొన్ని నెలల క్రితం తమన్నా ఒక బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతోంది అనే వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో పార్టీ చేసుకుంటూ హగ్గులు కిస్సులు వంటివి వీడియోలు బయటికి రావడంతో అందరూ షాక్ అయ్యారు. తమన్నా బాలీవుడ్ లో సినిమాల్లో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం.ప్రస్తుతం తమన్నా గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.