టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా. తెగులో హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం అయిన ఈ మిల్కీ బ్యూటీ కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఒకానొక దశలో కెరీర్ క్లోజ్ అవుతుందనన్న అనుమానాలు కూడా కలిగాయి. అయితే హీరోయిన్ గా కాకుండా ఐటమ్ సాంగ్స్ కి కూడా ఓకే చెప్పిన తమన్నాకి రాజమౌలి మంచి అవకాశం ఇచ్చారు.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ఫస్ట్ పార్ట్ లో తమన్నాను అవంతిక పేరుతో అప్సరసలా చూపించాడు. ఈ సినిమాతో తమన్నా జాతకం ఒక్కసారే మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మల్లీ లైన్ లోకి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు గ్లామర్ పాత్రలంటో ఇష్టముండదని..ముఖ్యంగా లిప్ లాక్ సీన్లంటే అస్సలు గిట్టదని అంటుంది.
అలాంటి సీన్లు చేయొద్దని నిబంధన పెట్టుకుందట. అయితే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే పిచ్చిగా ఇష్టపడతానని..అతనితో సినిమా తీయాల్సి వస్తే..తాను పెట్టుకున్న నిబంధనలు పక్కన పెడతానని చెబుతుంది. ఒకవేళ హృతిక్ సినిమాలో నటించే అవకాశం వస్తే ముద్దులు ధారాళంగా ఇస్తానని రీసెంట్ గా ఒక చాట్ షో లో వెల్లడించింది. స్వామి కార్యం.. స్వకార్యం అన్నమాట.