ఇండస్ట్రీలో సరైన బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవారికి ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పవచ్చు. ఎంతో మంది అవకాశాలు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అయితే ఎవరిని చూసినా సరే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే ఇలా ఇప్పటివరకు ఎంతోమంది నటీమణులు సైతం ఈ విషయంపై స్పందించారు. మరి కొంత మంది ఈ విషయం పైన మాట్లాడకపోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే మీ టూ ఉద్యమం వచ్చిందో అప్పటినుంచి అందరూ కూడా కాస్త ధైర్యంగా స్పందిస్తున్నారు.
ఇక తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే తమన్నా కూడా ఒక ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ మీద ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది తమన్నా. గడిచిన కొన్ని సంవత్సరాల వరకు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది తమన్నా. కానీ ఇప్పుడు సౌత్ లో ఈమెకు యంగ్ హీరోల సినిమాలలో అవకాశాలు పెద్దగా రావట్లేదు. దీంతో ఈమె అవకాశాల కోసం బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. తాజాగా ముంబైలో ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన తమన్నా..
హిందీలో అప్పట్లో ఒక నిర్మాత తన దగ్గరకు చాన్స్ కోసం వెళితే తన మేనేజర్ తో మాట్లాడమని చెప్పారట.. ఆ మేనేజర్ మాట్లాడుతూ.. మీకు ఛాన్స్ కావాలి అంటే నిర్మాతను సంతృప్తి పరచాల్సి ఉంటుందని ఒకసారి గెస్ట్ హౌస్ కి వస్తే అన్ని సెట్ అవుతాయని తెలియజేశారట. దీంతో వారి ఉద్దేశం తమకు అర్థం అయ్యిందని.. అందుకే అక్కడ నుంచి వచ్చేసానని తెలియజేసింది తమన్నా. అయితే ఆ నిర్మాత పేరు మాత్రం చెప్పలేదు తమన్నా.