పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచదృష్టిలో పడ్డారు ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషము. ప్రస్తుతం ప్రబాస్ చేతులో నాలుగు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కడుపునిండా భోజనం పెట్టేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రభాస్.
ముఖ్యంగా సినిమా షూటింగ్స్ ఎక్కువ ప్రభాస్ తన ఇంటి నుంచి స్వయంగా భోజనాన్ని తీసుకువస్తూ ఉంటారని ఇప్పటికే ఎంతోమంది నటి నటులు తెలియజేయడం జరిగింది. అలా హీరోయిన్ శ్రద్ధ కపూర్, పూజ హెగ్డే, శృతిహాసన్, అమితాబచ్చన్ సహా మిగిలిన నటీనటులు సైతం ప్రభాస్ గురించి తెలియజేయడం జరిగింది. తాజాగా మిల్కీ బ్యూటీ గా పేరు పొందిన తమన్నా ప్రభాస్ పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ భోజనం చేసేటప్పుడు 30 వంటకాలను తీసుకురావడంతో ఆశ్చర్యపోయానని తెలిపింది.
అలా చేయడం అంత సులువు కాదని.. ప్రభాస్ కి డబ్బులు అసలు మ్యాటర్ .. కాదని ఇది కేవలం ప్రజలకు ప్రత్యేక అనుభూతిని కల్పించడమే అన్నట్టుగా తెలియజేసింది. నిజమైన రాజుకు అతను సరైన వివరణ అంటూ తెలియజేసింది తమన్నా.. వాస్తవానికి ప్రజలపై అతను చూపే ప్రేమ, ప్రభావం గురించి అతను స్టార్డం గురించి చెప్పలేను కానీ.. ప్రభాస్ మాత్రం మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని తెలియజేసింది.