సినీ పరిశ్రమలోకి కొరియో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా ‘ప్రేమికుడు’సినిమాతో హీరోగా మారారు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ప్రభుదేవ తర్వాత దర్శకుడిగా మారి మంచి విజయాలు అందుకున్నారు. తెలుగు లోనే కాదు తమిళ, హిందీ భాషల్లోకూడా సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఆ మద్య తమన్నా, సోనూ సూద్ ముఖ్యపాత్రల్లో తానే దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘అభినేత్రి’మంచి విజయం అందుకుంది. హర్రర్ , కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో దుమ్మురేపింది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘అభినేత్రి 2’ రూపొందింది. ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది.
తాాజాగా ఈ సినిమా కు సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఇటు ప్రభుదేవాను .. అటు తమన్నాను దెయ్యం ఆవహించినట్టుగా చూపించారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎప్పుడు దెయ్యం ఆవహిస్తుందో..అనే విషయంపై సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇక మరింత కామెడీ డోస్ పెంచడానికి సప్తగిరి ఉండనే వున్నాడు. ‘అభినేత్రి’ స్థాయిలో ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.