వెండితెరపైనే కాదు ఓటీటీ లో కూడా సూపర్ హిట్ చిత్రాలతో సినీప్రియులను అలరిస్తున్న మిల్క్ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. అలాగే అటు హిందీ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది తమన్నా.. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు మిల్క్ బ్యూటీ స్పందించలేదు.
అయితే రేపు మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. నటీనటులు ఎదుర్కొనే బాడీ షేమింగ్ కామెంట్స్ పై స్పందించింది.. ఈ క్రమంలోని హీరోయిన్ సమంత అందం, మయోసైటిస్ సమస్యపై వచ్చిన ట్రోల్స్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. అంతేకాదు కోవిడ్ సమయంలో కాస్త బరువు పెరగడంతో గతంలో తమన్నాను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు నెటిజన్స్. ఇదే విషయాన్ని ఆమె మరొకసారి గుర్తుచేసుకుంది.. ఒక మహిళకు ఇది చాలా కష్టం. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే వారికి ఇలాంటి కామెంట్స్ మరింత బాధిస్తాయి. మేము నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తులము.
మా గురించి ప్రజల అభిప్రాయం .. వారు మన గురించి ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటాము.. కానీ మేము సెలబ్రిటీ కావడం వల్ల ప్రతి ఒక్కరూ మా గురించి ఏమని ఆలోచిస్తున్నారనేది తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి మేము ఎక్కడ ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాము.. నువ్వు .. నీవే.. నువ్వు ఇతరుల మాదిరిగా కనిపించాల్సిన అవసరం లేదు.. యూత్, పెద్ద వారి ఆలోచనలను తెలుసుకుంటున్నాను.. నేనెప్పుడూ మరొకరిలా ఉండాలని ప్రయత్నించను మన గుర్తింపు మనదే అంటూ తెలిపింది తమన్నా.