హ్యాపీడేస్ సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతకాలానికి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పలు సినిమాలలో బిజీగా ఉంటోంది.F-3 సినిమా తర్వాత ఇప్పటివరకు ఎక్కడ కూడా తన తదుపరిచిత్రాన్ని ప్రకటించలేదు. బాలీవుడ్ నటుడు తమన్నా గత కొద్ది కాలంగా రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో గత కొంతకాలంగా తమన్నా డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ కనిపించడంతో వీరి రిలేషన్‌కు మరింత బలం చేకూర్చింది. అంతేకాకుండా ఆ తర్వాత విజయ్ ను ముద్దు పేరుతో పిలుస్తూ తమన్నా సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులు షేర్ చేయడంతో వీరి రిలేషన్ కు సంబంధించి మరింత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి .ఈ క్రమంలోనే విజయవర్మతో రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలపై తమన్నా స్పందించింది.
ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూల పాల్గొన్న తమన్న రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై ఆసక్తికరమైన విషయాలను తెలిపింది తమన్నా మాట్లాడుతూ నేను విజయవర్మతో కలిసి ఒక సినిమా చేశాము అప్పటినుంచి మాపై రూమర్లు వినిపిస్తున్నాయి దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు.. మాకు అప్పటి నుంచి ఇలా ఎవరితో ఒకరితో.. బిజినెస్ మ్యాన్ తో ..ఇలా అందరితో మాకు పెళ్లిళ్లు చేసేస్తారు. కానీ నిజంగానే పెళ్లెప్పుడు జరుగుతుందో తెలియడం లేదు..? అప్పటివరకు వాళ్లు ఇదే ఉత్సాహంతో ఉండగలరు అంటూ సెటైర్లు వేసింది. ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.