తెలుగు సినీ ఇండస్ట్రీలో నవ మన్మధుడిగా టాలీవుడ్ అమ్మాయిల కలల రాకుమారుడు గా ఎందరికో ఫేవరెట్ హీరోగా ఉన్న నాగార్జున ఇప్పటికీ కూడా యంగ్ గానే కనిపిస్తాడు. ఎలాంటి సినిమాలో అయినా ఆయన లీనమైపోతు నటిస్తూ ఉంటారు..అది లవ్ రొమాంటిక్ సినిమాలే కానివ్వండి భక్తి సినిమాలే కానివ్వండి ఏవైనా సరే తన నటనతో అందరిని ఆకట్టుకుంటారు. అలాంటి నాగార్జునకి టాలీవుడ్ బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ టబు తో ఎఫైర్ ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో నాగార్జున కోసం టబు విషం తాగిందట. ఇప్పటికీ కూడా టబు పెళ్లి చేసుకోవడానికి నాగార్జున అలాగే అజయ్ దేవగన్ కారణం అంటున్నారు. టబు విషం తాగింది. అన్న వార్త నిజమే కానీ.. అది నాగార్జున కోసం కాదు నిన్నే పెళ్ళాడుతా సినిమా షూటింగ్ భాగంలో సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో టబు విషం తాగుతుందట. అయితే ఈ విషయాన్ని ముందుగా కృష్ణవంశీ నాగార్జున కి చెప్పకుండా కేవలం హీరోయిన్ వచ్చి కౌగిలించుకుంటుందని మాత్రమే చెప్పారట. అయితే కృష్ణవంశీ వేసిన అసలు ప్లాన్ నాగార్జునకి తెలియదు.
ఇక అప్పుడే టబు వచ్చి నాగార్జునని హగ్ చేసుకుని బెడ్ రూమ్ లో వాంథింగ్ చేసుకుంటుంది..ఇక ఆ బ్లడ్ చూసి ఒక్కసారిగా నాగార్జున షాక్ అయ్యాడు.గట్టిగా అరిచి టబు విషం తాగిందని భయపడిపోయాడట. ఇక నాగార్జున అరిచిన అరుపుకు కృష్ణవంశీ షూటింగ్ ఆపేసి సార్ టబు నిజంగా విషం తాగలేదు.. ఇది షూటింగ్లో ఒక భాగమే అయితే ఈ విషయాన్ని మీకు ముందుగా చెప్పలేదు అని అన్నారట. కానీ నాగార్జున మాత్రం ఈ సీను నాకు ఎందుకు చెప్పలేదు ముందుగా అని కోప్పడ్డాడట. కానీ కృష్ణవంశీ ఇది న్యాచురల్ గా ఉండడం కోసం ఇలా చేశాం సార్ అని చెప్పాడట.