టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాప్సీ.. ఈమె ఢిల్లీలో పుట్టి పెరిగింది. కానీ సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నటిస్తోంది. ఇక ఝుమ్మంది నాదం చిత్రం తరువాత వస్తాడు నా రాజు, వీర, షాడో, నేనెవరో ఆనందోబ్రహ్మ, మిస్టర్ పర్ఫెక్ట్, మొగుడు, సాహసం, వంటి సినిమాల్లో నటించింది కానీ వీటన్నింటిలో రెండో మూడో బ్లాక్ బస్టర్ హిట్లను సాధించాయి. ఆ తరువాత ఈమెకు అవకాశాలు కాస్త కనుమరుగయ్యాయి.. దాంతో ఏం చేయలేక బాలీవుడ్ కి చెక్కేసింది ఈ అమ్మడు
టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని బోలెడన్ని అవకాశాలను దక్కించుకుంది తాప్సి.. చెప్పాలంటే టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లోనే ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఉండి బిజీబిజీగా గడిపేస్తోంది. ఇదంతా కాస్త పక్కన పెడితే ఆ పెళ్లయిన హీరోని తాప్సి ప్రేమించిందట..ఇంతకు ఆ హీరో ఎవరనుకున్నారో కాదు ఆది పినిశెట్టి.. ఈయనతో గుండెల్లో గోదారి, నేనెవరో సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న టైం లోనే వారిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగి ప్రేమ వరకు దారితీసిందట. వీరిద్దరి మధ్య సన్నిహిత్యం ప్రేమ వరకు అయితే ఓకే కానీ బెడ్ రూమ్ వరకు కూడా దారితీసిందని గతంలో వార్తలు వినిపించాయి.
కానీ అదే టైంలో తాప్సికి అవకాశాలు తగ్గి నార్త్ కి దారి మళ్లింది. దాంతో వారిద్దరి మధ్య కనెక్షన్ కట్ అయిందట.అయితే ఆ తర్వాత ఆది పినిశెట్టి ,నిక్కీ గల్రని మధ్య లవ్ ట్రాక్ నడిచి పెళ్లి కూడా చేసుకున్నారు.కానీ ఈ విషయం తెలియని నేటిజెన్లు ఆ పెళ్లయిన అబ్బాయిని తాప్సి ప్రేమిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అమ్మడు టాలీవుడ్ పై ట్రోల్స్ చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో కూడా నిలుస్తోంది.
మరి తాప్సి కూడా వివాహం చేసుకొని అభిమానులకు డబుల్ ట్రీట్ ఇస్తుందేమో చూడాలి మరి.. ప్రస్తుత తాప్సి గురించి ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.