స్టార్ హీరో చేతిలో దారుణంగా మోసపోయిన తాప్సి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో కాని ఏ ఇతర ఇండస్ట్రీలో కానీ ఏ కారణం లేనిది ఇండస్ట్రీని వదిలిపెట్టి పోరు..వారికి అవకాశాలు రాకపోవటంతో అయినా లేదంటే ఇండస్ట్రీలో ఎవరైనా మోసం చేసి ఉంటే కూడా ఇండస్ట్రీని వదిలిపెట్టి వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోతారు. ఇలా ఏదో ఒక కారణంతో ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిలో తాప్సి కూడా ఒకరు.స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సి ఈమె తెలుగులో తక్కువ సినిమాలే నటించినప్పటికీ అవన్నీ ఈమెకి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.

Taapsee Pannu heads out to holiday with friends to celebrate this special  occasion! - Tamil News - IndiaGlitz.com

మొట్టమొదటిగా ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమై తాస్పి. అగ్ర హీరోలతో నటించింది తాప్సి. ఆ తర్వాత 2011లో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమే అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాజ్యమేలుతోంది. ముఖ్యంగా తాప్సీకి లేడీ ఒరియాంటెడ్ సినిమాలంటే ఆసక్తి ఎక్కువ

అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తూ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అలాగే తాప్సికి సంబంధించిన ఫోటోలను సినిమా అప్డేట్లను ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం తాప్సీ ఖాతాలో బోలెడన్ని సినిమా అవకాశాలు ఉన్నాయి.

అయితే ఇదంతా కాస్త పక్కన పెడితే తను ఎందుకు తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యింది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది . దానికి కారణం ఒక బడా హీరో కొడుకు .. తాప్సీ ని ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించాడట. లాస్ట్ కి తాప్సీ ని నువ్వు వద్దు అని చెప్పి హ్యాండ్ ఇచ్చాడట.అందుకని తాప్సి టాలీవుడ్ లో ఉంటే అతని ముఖం చూడాల్సి వస్తుందని బాలీవుడ్ కి షిఫ్ట్ అయిందని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై తాప్సి ఏనాడు స్పందించలేదు. మరి రాబోయే రోజుల్లో స్పందిస్తుందేమో చూడాలి మరి.

Share.