పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో సొట్టబుగ్గల హీరోయిన్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొట్టమొదటిగా తాప్సి ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది .ఆ తరువాత వీర , మిస్టర్ ఫర్ఫెక్ట్, దరువు, తదితర సినిమాలలో నటించింది. అంతేకాకుండాఅగ్ర హీరోల సరసన నటించింది. కానీ సరైన సక్సెస్ లేక బాలీవుడ్ వైపు అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ.

Ileana D'Cruz And Taapsee Pannu Can Write A Handbook On Dealing With  Trolls. Here's Why!

ప్రస్తుతం తాప్సి బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. ఇది కాస్త పక్కన పెడితే తాజాగా తాప్సి సోషల్ మీడియాలో అభిమానులతోనూ నెటిజెన్స్ తోను కొన్ని విషయాలను ముచ్చటించింది. ఇందులో భాగంగానే చిట్ చాట్ నిర్వహించటంతో ఒక నెటిజన్ ఆమెను ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే తాప్సి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. అని అడిగారట. అందుకు తాప్సి సమాధానం చాలా వంకరటింకరగా జవాబు ఇచ్చినట్టు తెలుస్తోంది.

నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు కాబట్టి నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అనే సమాధానం చెప్పిందట అయితే నేటిజెన్లు అడిగిన ప్రశ్న ఏంటి తను చెప్పిన సమాధానం ఏమిటి అన్న సందేహము చాలామంది అభిమానులలో కలుగుతోంది..తన పెళ్లి ఎప్పుడు అని అడగ్గా ఆమె మాత్రం నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు అని చెప్పటంతో అందరూ షాక్ అయ్యారు.

కొంపతీసి తాప్సి ప్రెగ్నెంట్ అన్న డౌట్లు కూడా చాలామందికి వస్తున్నాయి. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో ఒక స్టార్ హీరోయిన్ ఉద్దేశించి తాప్సి ఇలా చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై తాప్సి ఎలా స్పందిస్తుందో చూడాలి. కొంతమంది తాప్సి ఇండైరెక్టుగా ఇలియానాని ఉద్దేశించి మాట్లాడిందేమో అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరి తాప్సి ఈ విషయంపై తాప్సి ఇలా క్యాజువల్ గా అంద లేకపోతే ఆ హీరోయిన్ ఉద్దేశించే అందా అనే విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Share.