‘సైరా’ సెన్సార్ షాక్..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మంగా నటించిన మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించారు. చిరంజీవి కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. వివిధ భాషలకి సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భాషలన్నింటిలోను ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ మరియు ఒక లిరికల్ సాంగ్, సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు పెంచేసాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత కథను ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ అంశాలు జోడించి దర్శకుడు సురేందర్ రెడ్డి దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఒక్క కట్ కూడా చెప్పకుండా ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేయడం ఒక విశేషం అయితే, విడుదలకు వారం రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం మరో విశేషం.

ఇక సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎంతో అద్భుతంగా ఉంది అంటూ సైరా దర్శక నిర్మాతలను, అలానే మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, వంటివారు ఎంతో అద్భుతంగా నటించడం జరిగిందని అన్నారట. అయితే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయని, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ మరియు యాక్షన్ సెన్స్ అయితే సినిమాకు ఎంతో ప్రాణం అని వారు చెప్పినట్లు సమాచారం.

Share.