సైరా సెకండ్ ట్రైలర్.. అంచనాలు పెంచేసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. క‌ర్నూలు జిల్లా ఉయ్యాల‌వాడ‌కు చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కోలీవుడ్ లేడీ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో అమితాబ‌చ్చ‌న్‌తో పాటు కోలీవుడ్ విజ‌య్ సేతుప‌తి, టాలీవుడ్ జ‌గ‌ప‌తిబాబు, త‌మ‌న్నా, శాండ‌ల్‌వుడ్ కిచ్చ సుదీప్ లాంటి వాళ్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

అమిత్ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్లోత‌నే సినిమాపై అంచ‌నాలు ఆకాశానికి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు గురువారం ఉద‌యం సైరా ట్రైల‌ర్ 2 పేరిట మ‌రో ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ కూడా అరాచ‌కం… అంత‌కు మించి అనే రేంజ్‌లో ఉంది. ఆకట్టుకునే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిన ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా ? అన్న ఆతృత ప్ర‌తి ఒక్క‌రికి క‌లుగుతోంది.

ట్రైల‌ర్‌లో యాక్ష‌న్‌తో పాటు పంచ్ డైలాగులు బాగా పేలాయి. బ్రిటీష‌ర్ల‌కు సైరా న‌ర‌సింహారెడ్డికి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల ప‌రంగా ఈ డైలాగులు ప‌వ‌ర్ ఫుల్‌గా పేలాయి. ‘ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు’, ‘బలగాలతో వెళ్లిన మన ఓడలు వాళ్ళ బంగారంతో నిండి రావాలి’, ‘గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు’, వంటి డైలాగ్స్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి.

ఇక సైరా క్యారెక్ట‌ర్ చెప్పే ‘ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే స్వతంత్రం, స్వతంత్రం, స్వతంత్రం అంటూ మెగాస్టార్ చెప్పే డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. సైరా గురువు అమితాబ్ ‘ చంప‌డ‌మో చావ‌డ‌మో ముఖ్యం కాదు.. గెల‌వ‌డం ముఖ్యం ‘ అని సైరా పాత్ర‌లో ఉన్న చిరుకు ఉప‌దేశిస్తాడు. బ్యాటిల్ ఫీల్డ్ పేరుతో కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ దూసుకుపోతోంది. ఇక సైరా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Share.