దసరా సీజన్లో కుమ్మేసుకున్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సెలువులు పూర్తి కావడంతో బాక్సాఫీస్ దగ్గర స్లో అయ్యింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే 13 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు రు.100.60 కోట్ల షేర్ రాబట్టింది.
అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ మరో రు.10 కోట్లు వసూలు చేస్తే కాని బ్రేక్ ఈవెన్‌కు రాదు. నైజాం, నెల్లూరు, ఉత్తరాంధ్ర తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ భారీ నష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమాలో
నయనతార, అమితాబ్ బచ్చన్, అనుష్క, జగపతి బాబు, తమన్నా, విజయ్ సేతుపతి, కిచా సుదీప్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
సైరా 13 డేస్ వరల్డ్ వైడ్ వసూళ్లు (రూ.కోట్లలో) :
నైజాం – 31.30
సీడెడ్ – 18.10
వైజాగ్ – 15.60
ఈస్ట్ – 8.19
వెస్ట్ – 6.38
గుంటూరు – 9.39
కృష్ణా – 7.26
నెల్లూరు – 4.38
—————————————
ఏపీ + తెలంగాణ = 100.60 కోట్లు
—————————————