సాహోతో సైరాకు ఇబ్బందులు తప్పవా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బాలీవుడ్ రేంజ్ ని తలదన్నెలా తెరకెక్కుతున్న చిత్రాలు ఏమైనా ఉన్నాయంటే అవి ప్రభాస్ ‘సాహో’ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’. అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కుత్తున ఈ చిత్రాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వర్గాలని ఆకర్షిస్తున్నాయి. అందుకే ఈ సినిమాల విడుదల తేదీలకి రెండు వారాల దరిదాపుల్లో కొత్త సినిమాలు కూడా విడుదల పెట్టుకోవడంలేదు.
అయితే సైరా కంటే సాహోకి క్రేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం ఒకటైతే. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించడం ఒకటి.

ఆగస్టు 30న విడుదలవుతున్న ఈ సినిమా తొలిరోజు 100 కోట్లు రాబట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత నాని గ్యాంగ్ లీడర్, వరుణ్ ‘వాల్మీకి’చిత్రాలు విడుదల కానున్నాయి. వీటి తర్వాత అక్టోబర్ 2 న చిరంజీవి సైరా సినిమా విడుదల కానుంది. ఒకవేళ సాహో హిట్ అయితే దాని ప్రభావం నాని, వరుణ్ సినిమాలతో పాటు సైరా సినిమా మీదే పడే అవకాశం ఉంది. సాహో హిట్ టాక్ వస్తే నాని, వరుణ్ సినిమాలు విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే సాహో వల్ల సైరా కు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు.

సాహో బ్లాక్ బస్టర్ అయితే, కచ్చితంగా అన్ని విధాలా సైరా విషయంలో పోలికలు వస్తాయి. జోనర్ వేరయినా..కలెక్షన్లు, థియేటర్లు విషయంలో ఇబ్బందులు ఉంటాయి. దానికి తగ్గట్టు సైరా సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన కష్టం అవుతుంది. అలాగే సాహో బ్లాక్ బస్టర్ అయితే సినిమా నాలుగు వారాలు కనీసం థియేటర్లలో వుంటుంది. అంటే సైరాకు థియేటర్లు పూర్తిస్థాయిలో లభించడం కష్టం అవుతుంది.

ఒకవేళ సాహో సినిమా ఆశించిన మేర విజయవంతం కాకపోయిన సైరా కి కష్టాలు ఉంటాయి. ఎందుకంటే సాహో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 100 కోట్ల మేరకు అడ్వాన్స్ లు ఇచ్చేసి అగ్రిమెంట్లు రాయించేసుకుంటున్నారు. అంటే సినిమా మీద తెలుగులో 100 కోట్ల వరకు రావాలి. సినిమా ఫ్లాప్ అయితే ఇంత కలెక్షన్లు రాబట్టం కష్టం. ఈ నేపథ్యంలో వెంటనే వచ్చే సైరా సినిమాకు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బులు కట్టాలి అంటే అంత సులువుకాదు. అప్పుడు సైరా కొంచెం నష్టం కలిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా సాహోతో సైరాకి ఇబ్బందులు తప్పేలా లేవు..

Share.