మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ లు రికార్డులు క్రియేట్ చేస్తుంటే… గురువారం రిలీజ్ అయిన సైరా ట్రైలర్ 2 సైతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న సైరా రిలీజ్ కు ముందే పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే ప్రమోషన్లలో… సోషల్ మీడియాలో… ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డులు బద్దలుకొడుతున్న సైరా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో రిలీజ్‌కు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది.
బెంగుళూరు లోని ఒక్క ఊర్వశి థియేటర్లో 6 లక్షల గ్రాస్ వరకు ఆన్‌లైన్ టిక్కెట్ల ద్వారా అమ్ముడైనట్లు సమాచారం. ఉదయం 3 గంటల ఆటతో భారీ వసూళ్ళని రాబట్టినట్లు సమాచారం. ఒక్క మార్నింగ్ షో ఆటకే ఇంత వసూల్ చేస్తే, ఫస్ట్ డే కలెక్షన్స్ 25 లక్షలకు పై మాటే అని మెగా అభిమానులు చెబుతున్నారు. అంటే ఒక్క థియేటర్ నుంచి ఈ రేంజ్ వసూళ్లు వస్తే ఇక ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యే సైరా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందో ? అని అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.
దాదాపు రు. 270 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సైరా థియేట్రికల్, డిజిటల్ హక్కులతో నే భారీగా రికవరీ చేసేసుకుంది. సైరాకు రిలీజ్‌కు ముందే వస్తోన్న స్పందన చూస్తుంటే బాహుబలి రేంజ్ సునామి ని మరొక సారి తెలుగు ప్రేక్షకులు చూడనున్నారు. కథ బలంతో తెరకెక్కిన సినిమా కావడంతో సైరా దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.