‘ సైరా ‘ 14 డేస్ క‌లెక్ష‌న్స్‌… నో బ్రేక్ ఈవెన్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా…. మెగాస్టార్ కలల ప్రాజెక్టు భారీ అంచనాల మధ్య వచ్చిన సైరా సినిమా ఫ్లాప్ అయింది. ఇక బుధ‌వారంతో రెండు వారాలు కంప్లీట్ చేసుకున్నా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నైజాం, ఉత్తరాంధ్ర మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.

ఇప్ప‌టికే రెండు వారాలు కంప్లీట్ కావ‌డంతో పాటు చాలా చోట్ల థియేట‌ర్ల‌లోనుంచి ఈ సినిమాను తీసేస్తుండ‌డంతో సైరా ఇక లాభాల భాట ప‌ట్ట‌డం అనుమానంగానే క‌నిపిస్తోంది. అయితే మార్కెట్లో మ‌రో పెద్ద సినిమా లేక‌పోవ‌డం సైరాకు క‌లిసొచ్చేలా ఉంది. అటు నార్త్‌లోనూ.. ఇటు ఓవ‌ర్సీస్‌లోనూ ఇప్ప‌టికే ప్లాప్ అయ్యింది.

త‌మిళ్‌, క‌న్న‌డం, కేర‌శ‌లోనూ సైరా డిజాస్ట‌ర్ అయ్యింది. ఓవర్సీస్ లో టాప్-10 లిస్ట్ లోకి చేరింది కానీ బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది. అటు నార్త్ లో కూడా కేవలం 8 కోట్ల రూపాయల నెట్‌తో త‌న బాక్సాఫీస్ ర‌న్ ముగించేసుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఉత్త‌రాంధ్ర‌, నెల్లూరు మిన‌హా మిగిలిన ఏరియాల్లో బ‌య్య‌ర్లు ఏరియాను బ‌ట్టి 1-3 కోట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోనున్నారు.

సైరా 14 డేస్ ఏపీ + తెలంగాణ క‌లెక్ష‌న్లు (రూ.కోట్ల‌లో) :

నైజాం – 31.59 కోట్లు

సీడెడ్ – 18.54 కోట్లు

ఉత్తరాంధ్ర – 15.81 కోట్లు

ఈస్ట్ – 8.28 కోట్లు

వెస్ట్ – 6.97 కోట్లు

గుంటూరు – 9.45 కోట్లు

నెల్లూరు – 4.42 కోట్లు

కృష్ణా – 7.29 కోట్లు

Share.