మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా అక్టోబర్ 2 న రిలీజ్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భారతీయ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న నిర్వహించాలని అనుకున్నా వాయిదా పడింది. ఇక వెండితెరపై చిరంజీవి తొలిసారి కనిపించిన ప్రాణం ఖరీదు సరిగ్గా నలభై ఏళ్ల క్రితం సెప్టెంబర్ 22న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇక ఇప్పుడు ఈ యేడాది అదే తేదీన చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. నిజానికి, హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో ఈ నెల 18న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలనుకున్నారు. నిజానికి 18న ప్రి రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.
అయితే… వర్షాల కారణంగా ప్రీ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ నెల 22న నిర్వహించాలని నిర్ణయించారు. ట్రైలర్ కూడా అదే రోజున విడుదల చేయనున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఏపీ, తెలంగాణలో 94 థియేటర్లలో సైరా ట్రైలర్ ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ మెగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సినిమాలో చిరుతో పాటు అమితాబచ్చన్, కిచ్చ సుదీప్, నయనతార లాంటి స్టార్ హీరోయిన్.. విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక కొణిదెల లాంటి సెన్సేషనల్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.