మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణెదల ప్రొడక్షన్ హౌస్ ఫై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించగా..బిగ్ బి అమితాబచ్చన్ , నయనతార , తమన్నా , కిచ్చ సుదీప్ , విజయ్ సేతుపతి, తమన్నా , నిహారిక , అనుష్క మొదలగు స్టార్స్ నటిస్తుండడంతో సైరాపై అన్ని భాషల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
సైరా బడ్జెట్ విషయంలో కాస్త క్లారిటీ లేకపోయినా రూ.200 కోట్ల పైమాటే అంటున్నారు. నిర్మాత చరణ్ మాత్రం రూ.270 కోట్లు అయ్యిందంటూ ఫ్యాన్సీ రేట్ల కోసం లీకులు ఇస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది.వాస్తవానికి ఓవర్సీస్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మాలని చరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో చివరకు 15 కోట్లకు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. సైరా తెలుగు – తమిళ్ – మలయాళం – హిందీ – కన్నడ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నట్టు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ. 112 కోట్ల మేర రిలీజ్ బిజినెస్ జరిగిందంటున్నారు. నైజాం- 30కోట్లు (దిల్ రాజు).. సీడెడ్- 22 కోట్లు (ఎన్ వి ప్రసాద్).. నెల్లూరు- 5.20 కోట్లు (హరి పిక్చర్స్).. కృష్ణా – 9కోట్లు (జీ3 ఫిల్మ్స్).. గుంటూరు -11.50 కోట్లు (యువి క్రియేషన్స్).. వైజాగ్- 14.40 కోట్లు (క్రాంతి ఫిలింస్).. తూర్పు గోదావరి – 10.40 కోట్లు (విజయ లక్ష్మి ఫిలింస్).. పశ్చిమ గోదావరి- 9.20 కోట్లు (ఉషా పిక్చర్స్) మేర పలికింది. ఓవరాల్ గా ఆంధ్రా- తెలంగాణా కలుపుకుని 112 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది.
కేవలం ఇక్కడ మాత్రమే రూ.112 కోట్ల షేర్ అంటూ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావాలి. అన్ని ఏరియాల్లోనూ సైరాకు భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి సైరా ఈ భారీ టార్గెట్ను ఎలా చేధిస్తాడో .? చూడాలి.