‘ సైరా ‘ 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్ వార్‌లో సై సైరా..

Google+ Pinterest LinkedIn Tumblr +

చరిత్రలో మరుగునపడిపోయిన స్వాతంత్య్ర సమ‌ర‌ యోధుడు, తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మాతగా సైరా సినిమా తెర‌కెక్కింది. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ గా వచ్చిన ‘సైరా నరసింహా రెడ్డి’ పాజిటివ్ మౌత్ టాక్ తో, ఆంధ్ర, తెలంగాణలో మొదటి రోజు 38.22 కోట్ల షేర్ కలెక్ట్ చేసి తన సత్తా ఏంటో చాటుకుంది.

తొలి రోజుతో పోలిస్తే రెండో క‌లెక్ష‌న్ల‌లో చాలా డ్రాప్ క‌నిపించింది. అయినా రెండో రోజు కూడా మంచి వ‌సూళ్లే సైరా రాబ‌ట్టింది. ఇక మిగిలిన భాష‌ల్లో సైరాకు అనుకున్న రేంజ్లో స్పంద‌న లేక‌పోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దూసుకుపోతోంది. రెండవ రోజు ‘సైరా’ తెలుగు రాష్ట్రాల్లో 10.1 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి 2 రోజుల్లో 48.32 కోట్ల షేర్ దగ్గర నిలిచింది.

ఏరియాల వారీగా ‘సైరా’ రెండో రోజు కలెక్షన్స్ వివరాలు…

ఏరియా – డే-2 – డే -1 (రూ.కోట్ల‌లో)

నైజాం – 3.99 – 8.10

సీడెడ్ – 1.82 – 6.01

గుంటూరు – 0.67 – 5.05

ఉత్తరాంధ్ర – 1.65 – 4.70

ఈస్ట్ – 0.55 – 4.74

వెస్ట్ – 0.37 – 4.50

కృష్ణా – 0.73 – 3.03

నెల్లూరు – 0.32 – 2.09
——————————
మొత్తం = 10.10 – 38.22
——————————

ఏపీ / తెలంగాణ రెండు రోజుల షేర్ : 48.32 కోట్లు

Share.