‘ సైరా ‘ 12 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పంద‌నే వ‌చ్చినా ఇత‌ర భాష‌ల్లోనూ… ఇత‌ర ప్రాంతాల్లోనూ అనుకున్న రేంజ్‌లో స్పంద‌న లేదు. క‌ర్నూలు జిల్లాకు చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సైరాలో మెగాస్టార్ న‌ట‌న మాత్రం అదిరిపోయింది. నయనతార కథానాయిక, అమితాబ్ బచ్చన్, అనుష్క, జగపతి బాబు, తమన్నా, విజయ్ సేతుపతి, కిచా సుదీప్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇక ద‌స‌రా సెల‌వులు కూడా కొంత వ‌ర‌కు సైరాకు హెల్ఫ్ అయ్యాయి. సైరా 12 రోజుల‌కు ప్రపంచవ్యాప్తంగా 135.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కు సైరా 95 % పెట్టుబడిని తిరిగి పొందింది. ఇక సైరా సినిమా త‌ర్వాత చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే సినిమా కూడా ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక సైరా 12 రోజుల వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

సైరా 12 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు (రూ.కోట్ల‌లో) :

నైజాం – 30.90

సీడెడ్ – 17.95

వైజాగ్ – 15.45

ఈస్ట్ – 8.15

వెస్ట్ – 6.32

గుంటూరు – 9.36

కృష్ణా – 7.19

నెల్లూరు – 4.35
————————————-
ఏపీ+తెలంగాణ = 99.67 కోట్లు
————————————-

క‌ర్నాట‌క – 15.0

రెస్టాఫ్ ఇండియా – 7.60

ఓవ‌ర్సీస్ – 13.0
—————————————–
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ = 135.27 కోట్లు
——————————————

Share.