మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రక చిత్రం ” సైరా నరసింహ రెడ్డి ” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమాకి చెందిన కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలను షూట్ చేయటానికి చిత్ర బృందం జార్జియా ప్రాంతానికి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి జార్జియా లో షూటింగ్ జరుగుతున్న వీడియో మరియు లొకేషన్ లోని ఫోటోలని తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియో చూస్తుంటే సైరా కి సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించనున్నారని అర్ధం అవుతుంది.
సైరా సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిరంజీవి కి గురువు పాత్ర లో నటిస్తున్నారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్ లో అమితాబ్ షూటింగ్ లో కూడా పాల్గొని తన పార్ట్ ని పూర్తి చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘ సైరా ‘ సినిమాని నిర్మిస్తున్నారు. సైరా వచ్చే సంవత్సరం వేసవికి ప్రేక్షకుల ముందుకి రానుంది.
All set for the war!#ActionBegins #SyeRaa #Georgia pic.twitter.com/LRXL4o3wrn
— SurenderReddy (@DirSurender) September 17, 2018