‘సైరా నరసింహ రెడ్డి’ అఫీషియల్ టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నతాజా చిత్రం ‘ సైరా నరసింహ రెడ్డి ‘ ఈ సినిమా అఫీషియల్ టీజర్ ఈ రోజు విడుదల అయ్యింది. ఆగష్టు 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ గా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ చిత్రానికి అమిత్ త్రివేది స్వరాలూ సమకూర్చారు.

సైరా సినిమా తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో లో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండటం మరో విశేషం. ఇటీవలే అమితాబ్ తన షూటింగ్ పార్ట్ ని కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ భారీ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందాల భామ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని ఈ సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. స్వాత్యంత్ర సమర యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలొకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర మోషన్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

Share.