సైరా.. ఇది ఇండియన్ ఫ్రీడం ఫైటర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. బ్రిటీష్ పాలకులను ఎదిరించిన తీరు, తన దేశంలో బ్రిటీష్ పాలకులు ఎలా దోపిడి, అణిచివేత సాగిస్తున్న తీరును కథగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆ మూడు రెండు సినిమాలను కలవరపెడుతుంది…
ఇంతకు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం కలవరపెడుతున్నది ఎవరిని.. ఏ హీరోలను అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారగా, ఆ హీరోలకు మాత్రం నిద్ర లేకుండా చేస్తున్నదట.. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా ఓవర్సీస్లో మూడు మిలియన్లకు హక్కులను కొనుగోలు చేశారు బయ్యర్లు. అయితే సైరా ఇప్పటి వరకు కేవలం రెండు మిలియన్లు మాత్రం సాధించింది. ఇంకా మిలియన్ వసూలు చేయాల్సి ఉంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం నెగిటివ్ టాక్ రావడంతో ఆ సినిమాపై భారీ ప్రభావం పడింది. అదే సైరా చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. కానీ ఎందుకో వసూళ్ళు మాత్రం అంతంతగానే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. అందుకే ఇప్పుడు సైరా వసూళ్ళను చూస్తే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురం సినిమాలు ఓవర్సీస్లో ఎలా వసూలు చేస్తాయో అనే భయం పట్టుకుందట.. సో సైరా ఫలితం వీటికి వస్తే పరిస్థితి ఏంటన్నది వీరిని భయపెడుతుందట..